Latest Story

పరిక్షలలో విద్యార్థి !:-)

Friday, June 17, 2011
By శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్

కాలచక్రం పుస్తకం నుండి రచయిత : ‘కవికులాలంకార’ కీ.శే. చామర్తి కృష్ణమూర్తి కె కోటపాడు గ్రామం, విశాఖజిల్లా చూచున్ వాచరునొక్కకంట, పరికించున్ స్లిప్పునన్యంబుతో లేచున్, జుట్టును దిర్గు, నొక్కపరి నిర్లిప్తంబుగా నుండి సం – కోచించున్, భ్రమియించి త్రుళ్ళిపడు, సిగ్గుజెందునందీయగా దాచున్, దోజు, పరిత్యజించు, వడి మిథ్యాదాహ దౌర్బలముల్ సూచించున్, సరివారితో బెనగి యేచున్, వేళ బ్రశ్నించుచున్ వాచీ తప్పని యెంచు, బయటజనముల్ స్క్వాడల్లదే యన్నచో గోచీ సాందుల జేబులన్ దడిమి, తద్గుహ్యంబులర్పించి మా – యాచాతుర్యము జూపుచున్ వరుసగా నల్పాచమానార్థమై వేచున్ గుడ్య పరీసరంబుల, దిశల్ వీక్షించు నందందు... »

కాలేజీ గడియారమా !

Wednesday, October 20, 2010
By శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్

‘ కవిశేఖర ‘ కీ||శే|| శ్రీ భోగరాజు నారాయణ మూర్తి గారు (1889-1944) వ్రాసిన ” కాలేజీ గడియారమా ” అనే పద్యాలను సేకరించి కవితిలకులు కీ||శే|| శ్రీ వసంతరావు వేంకటరావుగారు “ తూర్పు సీమ ” అనే పత్రికలో ప్రచురింపజేసారు. ఆ ప్రతిని భద్రపరిచి, అందించిన శ్రీ వసంతరావు వేంకటరావుగారి అన్నగారి కుమారులు శ్రీ దాతా రావుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు . కాలేజీ గడియారమా! (భోగరాజు నారాయణ మూర్తి గారు విజయనగర సంస్థానాస్థాన కవి. విజయనగరం మహారాజ కాలేజీ... »

మహిళాదినోత్సవ సందర్భంగా… ప్రమదావనం!

Sunday, March 7, 2010
By శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్

1) భద్రమ్ముగాగ సుభద్రాపరిణయంబు గూర్చిన తిమ్మక్క కూర్మి తనయ మల్లెసరుల తావి మనసుల రంజింప రామకథను వ్రాసె రమణి మొల్ల మన్నారుచరితంబు నెన్నంగ రచియించి రంగాజి కురిపించె రసజవాజి ముద్దు ముద్దుగ రాధ మురిపాలు వివరించి మురిపించె కృష్ణుని ముద్దు పళని ఎందరెందరొ కవయిత్రు లిందు వెలసి ఆంధ్రజనని కీర్తి నవని నిలిపి తెనుగు తేనె తీపి తెలిపిన ఘనులకు అంజలి ఘటి యింతు నమ్మ నేడు! 2) ధీశక్తి రాజ్యంబు ధిషణతో పాలించు ధీయుత రుద్రమ్మ ధీరచరిత మంత్రాంగ రచనలన్ మహదేవు పూజలన్ మహనీయ నాగమ్మ మహిత చరిత రక్తి గొన్న మగని రణమున కంపిన మహితాత్మ మాంచాల... »

ఆశువులు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం

Saturday, February 20, 2010
By శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్

ఆశువులు 1. శ్రీ పి. వి. నరసింహరాజు – శతావధానాన్ని శతపత్ర సుందరిగా పోలుస్తూ అరయన్ పృచ్ఛకపత్రముల్ విరియ నవ్యంబైన యూహల్ మదిన్ పరమానందము గూర్చు బాలరవియై పద్యమ్ములే తేనెలై సరసుల్ ప్రేక్షకులెల్ల బంభరములై సాగంగ నీ యజ్ఞమే అరవిందాసన బ్రోచుగావుత శతంబానందమై అందమై 2. డా|| వై. బాబూరావు – అమరజీవి ఆత్మవేదన మేమొక జాతి మాది యుపమింపగలేని రసార్ద్రభాష ఏ స్వామికి కాళ్ళుబట్టుటకు స్వాంతము లొప్పవు మాకటంచు శ్రీ రాముడ గాంధిశిష్యుడను రాష్ట్రముకై బలియైతి నేను నే డేమిది గోతిలో పడియె యింత సమైక్యము కాలిపోవుచున్! 3. శ్రీమతి... »

వర్ణనలు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం

Saturday, February 20, 2010
By శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్

వర్ణనలు 1. శ్రీమతి గుమ్మా చంపావతి –  సీతారాముల కల్యాణోత్సవం వశిష్ఠవిశ్వామిత్రుల ఆనందం. చంపకమాలలో. కలకల నవ్వు మైథిలి ముఖంబును జూచుచు రామచంద్రుడున్ గలగల స్వామి నవ్వుల నెగాదిగ జూచుచు లోకమాతయున్ తలిరుల జేతులందున సుధామయ ముక్తములట్లె యుంచ దో సిలి గని నవ్వి పల్కెను వశిష్ఠుడు శిష్ట మహార్ష ధర్మముల్ 2.  శ్రీ జి. రామయ్య రెడ్డి –  సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వైభవం, విడిపోతే విషాదం కలిసి బ్రతికియున్నన్ కల్పవృక్షంపు నీడన్ తెలుగుజనని నిల్చున్ తీపికైతల్ విదల్చున్ కలతల విడివడన్ కర్మముల్ కాలిపోవున్ తెలుగువెలుగు లారున్ తీవ్రవాదాలు రేగన్ 3.... »

దత్తపది -అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం

Saturday, February 20, 2010
By శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్

దత్తపదులు 1. శ్రీమతి బి. హెచ్. దేవీ ప్రకాష్ – వారాయి, నానుని, వందె, నినవు – భారతార్థంలో వారా యీ భువి నేలువారు! సతులన్ వస్త్రంబులే యూడ్చు వా రా రాజున్ మురపించినాను నిజ ధైర్యాగారమున్ దాచినా నా రారాజు శిరమ్ము తన్నుటకు ఖాయంబూరువందే గదన్ బోరింతున్ పరమాత్మసాక్షి యని నవ్వున్ భీముడత్యుగ్రతన్ 2. శ్రీమతి పంతుల జయమహేశ్వరి – ఘనము, మనము, ధనము, జనము – భాగవతార్థంలో శుకుని మహాప్రబోధనము సూనృత వృక్షము లోకరక్షకై నికరము జేసి నీ మనము నీరజనేత్రునియందు నిల్పు దీ పిక... »

Loading