చందః మంజూష
ఛందస్సు 101 – రెండవభాగము
గమనిక: క్రింద మీరు చదవబోయే టపా సంకా రామక్రిష్ణ గారు surasa.net లో ఇంతకుముందెన్నడో ప్రచురించిన తెలుగు ఛందస్సు – 101 అన్నవ్యాసం లో ఒక భాగము. అసలు వ్యాసాన్ని యూనీకోడీకరించి ఆసక్తి ఉన్నవారు సులభం గా చదువుకోవటానికి వీలుగా ఇక్కడ పునః ప్రచురిస్తున్నాం. ఈ పరంపరలోని మొదటి టపా: ఛందస్సు 101 – మొదటి భాగము వృత్తాలు ఉత్పలమాల ఈ వృత్తం నడక ఇలా ఉంటుంది: “తానన తాన తాన తన తానన తానన తాన తాన తా” |____ యతి మైత్రి... »
ఛందస్సు 101 – మొదటి భాగము
గమనిక: క్రింద మీరు చదవబోయే టపా సంకా రామక్రిష్ణ గారు surasa.net లో ఇంతకుముందెన్నడో ప్రచురించిన తెలుగు ఛందస్సు – 101 అన్న వ్యాసం లో ఒక భాగము. అసలు వ్యాసాన్ని యూనీకోడీకరించి ఆసక్తి ఉన్నవారు సులభం గా చదువుకోవటానికి వీలుగా ఇక్కడ పునః ప్రచురిస్తున్నాం. లఘువు: ఏక మాత్రా కాలంలో ఉచ్చరించ బడేది లఘువు. దీని గుర్తు “I”. సాధారణంగా హ్రస్వాలు లఘువులవుతాయి. I I I ... »
వృత్తౌచిత్యము పై శ్రీ కేరాగారి విమర్శనము
శ్రీ కేతవరపు రామకోటిశాస్త్రి గారి వృత్తౌచిత్య విచారములో వారు ప్రస్తావించిన కొన్ని విషయాలతో నేను పూర్తిగా ఏకీభవించ లేకపోయాను. క్షేమేంద్రుడు తన సువృత్తతిలకములో పేర్కొన్న వృత్తౌచిత్యము, సర్వత్ర సర్వధా వ్యాపన శీలమైన సిద్ధాంతము కాదనడంలో పెద్ద సందేహమేమీ లేదు. కానీ, తర్వాత వారు చెప్పిన ఈ క్రింది విషయాలు కొంత గందరగోళంగా ఉన్నాయి: “వృత్తములు గణముల మీద నిర్మింపబడినవి గనుక నా యా గణములవలన పద్యములలో వచ్చు భేదము లేకపోయినను, పరుషసరళాది, ద్విత్వసంయుక్తాది... »
చేరా గారి మాత్రా చందో రీతులు
ఈ రోజు, శ్రీ చేరా గారి “ముత్యాల సరాల ముచ్చట్లు…” అన్న పుస్తకంలోని మాత్రా చందో రీతులు అన్న ఆసక్తి కరమైన వ్యాసాన్ని చదివాను. ఆధునిక కవుల కవితలనుండి ఉదాహరణలిస్తూ వివిధ మాత్రా ఛందస్సులలో ఉండే రకరకాల నడకలగూర్చి వివరించారు. ఇది 1958 లో అతను వ్రాసిన వ్యాసం. అందులో కొన్ని విషయాలు నన్ను ఆలోచింపజేసాయి. ఒక చోట అతనంటారూ, “పద్యం ఏదైనా ఏదో ఒక లయకు సరిపోతుంది. ప్రాచీనులు పేర్కొన్న వృత్తాలను కూడా మాత్రా ఛందస్సుల... »
