పద్యమంజూష
మహిళాదినోత్సవ సందర్భంగా… ప్రమదావనం!
1) భద్రమ్ముగాగ సుభద్రాపరిణయంబు గూర్చిన తిమ్మక్క కూర్మి తనయ మల్లెసరుల తావి మనసుల రంజింప రామకథను వ్రాసె రమణి మొల్ల మన్నారుచరితంబు నెన్నంగ రచియించి రంగాజి కురిపించె రసజవాజి ముద్దు ముద్దుగ రాధ మురిపాలు వివరించి మురిపించె కృష్ణుని ముద్దు పళని ఎందరెందరొ కవయిత్రు లిందు వెలసి ఆంధ్రజనని కీర్తి నవని నిలిపి తెనుగు తేనె తీపి తెలిపిన ఘనులకు అంజలి ఘటి యింతు నమ్మ నేడు! 2) ధీశక్తి రాజ్యంబు ధిషణతో పాలించు ధీయుత రుద్రమ్మ ధీరచరిత మంత్రాంగ రచనలన్ మహదేవు పూజలన్ మహనీయ నాగమ్మ మహిత చరిత రక్తి గొన్న మగని రణమున కంపిన మహితాత్మ మాంచాల... »
ఆశువులు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం
ఆశువులు 1. శ్రీ పి. వి. నరసింహరాజు – శతావధానాన్ని శతపత్ర సుందరిగా పోలుస్తూ అరయన్ పృచ్ఛకపత్రముల్ విరియ నవ్యంబైన యూహల్ మదిన్ పరమానందము గూర్చు బాలరవియై పద్యమ్ములే తేనెలై సరసుల్ ప్రేక్షకులెల్ల బంభరములై సాగంగ నీ యజ్ఞమే అరవిందాసన బ్రోచుగావుత శతంబానందమై అందమై 2. డా|| వై. బాబూరావు – అమరజీవి ఆత్మవేదన మేమొక జాతి మాది యుపమింపగలేని రసార్ద్రభాష ఏ స్వామికి కాళ్ళుబట్టుటకు స్వాంతము లొప్పవు మాకటంచు శ్రీ రాముడ గాంధిశిష్యుడను రాష్ట్రముకై బలియైతి నేను నే డేమిది గోతిలో పడియె యింత సమైక్యము కాలిపోవుచున్! 3. శ్రీమతి... »
వర్ణనలు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం
వర్ణనలు 1. శ్రీమతి గుమ్మా చంపావతి – సీతారాముల కల్యాణోత్సవం వశిష్ఠవిశ్వామిత్రుల ఆనందం. చంపకమాలలో. కలకల నవ్వు మైథిలి ముఖంబును జూచుచు రామచంద్రుడున్ గలగల స్వామి నవ్వుల నెగాదిగ జూచుచు లోకమాతయున్ తలిరుల జేతులందున సుధామయ ముక్తములట్లె యుంచ దో సిలి గని నవ్వి పల్కెను వశిష్ఠుడు శిష్ట మహార్ష ధర్మముల్ 2. శ్రీ జి. రామయ్య రెడ్డి – సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వైభవం, విడిపోతే విషాదం కలిసి బ్రతికియున్నన్ కల్పవృక్షంపు నీడన్ తెలుగుజనని నిల్చున్ తీపికైతల్ విదల్చున్ కలతల విడివడన్ కర్మముల్ కాలిపోవున్ తెలుగువెలుగు లారున్ తీవ్రవాదాలు రేగన్ 3.... »
దత్తపది -అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన, విజయనగరం
దత్తపదులు 1. శ్రీమతి బి. హెచ్. దేవీ ప్రకాష్ – వారాయి, నానుని, వందె, నినవు – భారతార్థంలో వారా యీ భువి నేలువారు! సతులన్ వస్త్రంబులే యూడ్చు వా రా రాజున్ మురపించినాను నిజ ధైర్యాగారమున్ దాచినా నా రారాజు శిరమ్ము తన్నుటకు ఖాయంబూరువందే గదన్ బోరింతున్ పరమాత్మసాక్షి యని నవ్వున్ భీముడత్యుగ్రతన్ 2. శ్రీమతి పంతుల జయమహేశ్వరి – ఘనము, మనము, ధనము, జనము – భాగవతార్థంలో శుకుని మహాప్రబోధనము సూనృత వృక్షము లోకరక్షకై నికరము జేసి నీ మనము నీరజనేత్రునియందు నిల్పు దీ పిక... »
సమస్యలు-అవధాన చక్రవర్తి శ్రీగరికపాటి నరసింహారావుగారి శతావధాన సాహితీక్రతువు – విజయభావన , విజయనగరం
విజయభావన సాహితీమిత్ర సమాఖ్య, విజయనగరం వారి ఆధ్వర్యంలో 25,26,27 డిసెంబర్ 2009 తేదీలలో మహాసహస్రావధాని, అవధాన చక్రవర్తి శ్రీ గరికపాటి నరసింహారావుగారు నిర్వహించిన శతావధాన సాహితీక్రతువు లో సమస్యాపూరణ పద్యాలు. సమస్యలు 1. అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వరశర్మ - మేరీమాత సుతుండు రాముడనియెన్ మేకొంచు సౌమిత్రియే ఏ రాజన్యునికైన స్వీయ జననీ హ్రీరమ్యమౌ నంకమే చేరన్ గోరెడు చోటుకాదె విపినశ్రీ కేగుచో ముందుగా చేరున్ దల్లి నటంచు దానిగని ఆర్చెన్ “వేడగా వచ్చి నా మేరీ? మాత, సుతుండు రాము” డనియెన్ మేకొంచు సౌమిత్రియే 2. శ్రీ... »
శ్రీకాకుళపు దిరునాళ్లు, భట్టు నలగామరాజుకు చెప్పిన రాజనీతి – శ్రీనాథుఁడు
శ్రీకాకుళపు దిరునాళ్లు జవరాలి బొడగన్న సన్యాసిపై నేయుఁ దులసి లేఁజిగురాకుదూపు మరుఁడు వేదవిప్రునిగన్న విధవపై ఝళిపించు దర్భపల్లవహేతి దర్పకుండు కటకారకులకన్య గన్న హాలికుమీఁదఁ బొడుచుఁ బూములుకోల పుష్పశరుఁడు నాడింధమునిగన్న నాతిపై నేయును నలరు జిచ్చఱకోల నంగభవుఁడు బెరసి వెన్నెలగాయంగఁ బేరకమ్మ పులినతలముల నాయాయి కొలములెఱిఁగి తాల్చు శస్త్రాస్త్రములు జారదంపతులకు నసమబాణుండు తిరునాళ్ల నన్నినాళ్ల భట్టు నలగామరాజుకు చెప్పిన రాజనీతి మలిదేవభూపతి మన్నించి యిటకు నన్నుబుత్తంచెను నరనాథ వినుము. పగ వృద్ధిబొందించు భ్రష్టులెకాని అడఁగించునేర్పరు లవనిలో లేరు… పోరు మంచిదికాదు భూమినక్కెడను పాడౌను దేశంబు పగ మించెనేని ప్రజలెల్ల నశియంచి పాఱిపోవుదురు బండారమునకును పైకంబులేదు రాణువ లందుచే రహి చెడియుండు చేజీతగాండ్లెల్లఁ జెలఁగి కోపించి ఈగలజీతంబు లిమ్మందురపుడు పతిబంటుమేరలు పరిహృతమగును పంపినపనిచేయ పాలుమాలుదురు తెలిసినశాత్రవుల్... »
’మృత్యుంజయ శివ శతకము’ – కొన్ని పద్యాలు
శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన “మృత్యుంజయ శివ శతకము” నుంచి కొన్ని పద్యాలు - హర హర యెట్టికవితయొ మఱిమఱినాలోని కోర్కి మనివి యొనర్పన్ గఱకఱకలమున నేడ్చెడుఁ బఱపఱనాపదలఁ గోసి బ్రతికించు శివా! ఊరులు పల్లెలు నారులు చీరలు మఱిసకలమైన సిరులివి మేలా యారూఢిగఁ జిరకాలము నీరూపము జూచుకోర్కె నెగడించు శివా! జోడుగఁ దోడుగ నీడగ వేఁడుకతో శ్రుతుల మేళవించుచు నిన్నుం బాడి కసి దీర్చుకొందుము వేఁడెద మాజంటఁబెంచు పెక్కేండ్లు శివా! పెక్కులు ప్రేలెదఁ... »
రాధ స్వప్నము: విశ్వనాథ సత్యనారాయణ
(శృంగార వీథి నుంచి…) ఓ చెలి! రాత్రి నేను గల యొక్కటి గంటిని, దానిలోఁ జిరం టీచతురాంగజుండు మననెయ్యపుఁబ్రోవు యశోదకన్నవాఁ డాచరణంబొనర్చె నొక యద్భుత-మస్మదురోజముల్ మృదు శ్రీచరణాంకితంబులుగ నృత్యముచేసె సకింకిణీధ్వనిన్. అదియొక మాయగా హృదయమందున స్వామి నటిమ్చుచుండె న న్నది తెలియంగవచ్చు, నయినన్ బతిరూపము గానుపించ, దా పదములు కానుపించుఁ, బతిపాదతలంబులు చిల్కముక్కుపూ లెద వెదజల్లినట్లయి సమృద్ధిగఁ బుల్కలపంట యేర్పడెన్. నే నిదురించుచుంటినని నేను నెఱుంగుదుఁగాని, మేలుకొ న్నా నను నొక్క జ్ఞానకలనంబున దీపితమై, విచిత్రరే ఖానటనాభిరామపదకంజమలన్ గుచసీమ కాంతిపా ధోనిధి మెట్టతామరలతోడి గిరిద్వయిపోల్కికిం జనెన్. ప్రణతిపరంబుగా నెదురుబళ్ళుగ వంచిన కాలియాహిచి క్కని పడగల్ హసించుచనుకట్టున... »
’సూర్యనారాయణ శతకము’ నుంచి కొన్ని పద్యాలు
శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు రచించిన “సూర్యనారాయణ శతకము” నుంచి కొన్ని పద్యాలు. అరయంగా సకల శ్రుతి స్మృతి పురాణాద్యర్థసారంబుఁ బ ల్మరు నాశక్తి కొలందిఁ జూచి తుదకిమ్మై రూఢిఁ గైకొంటి సం సరణాంబోధిఁ దరింపఁజేయుటకు యుష్మద్భక్తి దక్కన్య మీ నరలోకంబున లేదుపాయమని యన్నా సూర్యనారాయణా!’ ఉదయాద్రి న్నినుఁ జూచినంత వెరనెంతో పారు చీఁకట్లు వెం టఁ దగుల్నీ ప్రభకోడి వానిదగు కూనల్పాదుల న్నీడలై యొదుగన్వానిని రేయి తల్లి కడ కోహో తూర్పునంబంపు నీ దుదయ న్నా తరమా గణింప గుణ సింధూ సూర్యనారాయణా! తొలి రంగెద్దియులేని... »
రామా! ఆర్త రక్షామణీ!
రామా! ఆర్త రక్షామణీ! అన్న మకుటం తో కొన్ని పద్యాలు పాత పద్యాల పుస్తకాల్లో అక్కడక్కడా ఉన్నాయి. చాటు పద్య మణిమంజరి లో నాలుగుపద్యాలున్నాయి. వీటన్నిటినీ ఒకచోటి చేర్చి ఇలా ఇక్కడ ప్రచురిస్తున్నాం. శరణన్నన్ కరుణింతువన్న బిరుదుల్ జాలంబులే చాలునో ’శరణో’హో యన రావదేమి? వినవో! సంసార తాపత్రయం బెరుగన్నీయదొ? యెందుకెమొ చెపుమా యీ నిర్దయాబుద్ధి? ఏ మరితో మున్న విభీషణాదులకు రామా! ఆర్త రక్షామణీ! పరుగైరాగదె! త్రోవగానవొ! సురల్ ప్రార్థించిరో! సామగా నరుచిన్ సొక్కితొ! ఆంజనేయుని వడి న్రావించితో! జానకీ చరణాబ్జంబులు నొచ్చెనో! యితర... »
