పద్యాలతో కసరత్తు

చతుర్విధ కందము

Thursday, October 22, 2009
By పద్యం.నెట్

ఒకే కందపద్యాన్ని వివిధ రీతుల్లో విభజించి అర్థం భంగం కలగకుండా మరికొన్ని కంద పద్యాలను రాసే ప్రక్రియను ’చతుర్విధ కందము’ అంటారట. క్రింది రచన అలాంటిదే - ఓద్వేటి వెంకట కృష్ణయ్య అనే కవి, అప్పటి గద్వాల ప్రభువు సీతారామభూపాలుడు గురించి రాసిన క్రింది చతుర్విధ కందం చూడండి. సురరాజ విభవ లక్షణ భరితావనజాస్త్ర రూప వర కవి వినుతా హరిభక్తి యుక్త విలసత్ కరుణాదినకర సుతేజ గద్వాల నృపా! వనజాస్త్ర రూప వరకవి వినుతా హరిభక్తి యుక్త విలసత్కరుణా దినకర సుతేజ గద్వా లనృపా సురరాజ విభవలక్షణ... »

అక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

….అని నేనలేదండీ! ఒట్టు. ఇది దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు సంకలనం చేసిన చాటుపద్యరత్నాకరము లోనిది. ఇది ఒక సమస్య. చాలా క్లిష్టం గా ఉన్నట్లుంది కదూ! మోచర్ల వెంకన్న దీన్ని ఎంత చమత్కారంగా పూరించాడో చూడండి: ఱక్కసి వలె ముప్రొద్దును మొక్కుచుఁ దిరిగెదవు కాలిమెట్టున నిన్నున్ గుక్కక మానను దసినీ యక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్ ఇదే సమస్యకు “తెలుఁగు సమస్యలు” – వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ అనే సంకలనం లో ఇంకో రకమైన పూరణ ఉంది. పూరించినవారెవ్వరో తెలియదు. చూడండి: వక్కాకు... »

పచ్చనైన చెట్టు పద్యమయ్యె!

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

పద్యప్రియులకి స్వాగతం! ఈ పద్యాల కసరత్తు శీర్షికలో మీరందరూ పాల్గొని చక్కని పూరణలు, పద్యాలు రచిస్తారని ఆశిస్తూ… మొట్టమొదటి అంశం: “పచ్చనైన చెట్టు పద్యమయ్యె!” ఇది సమస్య. ఇది ఆటవెలదిలో ఒక పాదం. సమస్యని పూరించడమంటే, ఇచ్చిన పాదం వచ్చేట్టుగా మిగిలిన పద్యాన్ని అర్థవంతంగా పూర్తిచెయ్యడం. »

అసలు-నకలు

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

గోపికలు శ్రీకృష్ణుని వెదకుచు బృందావనములోని తరులతాపుష్పములను ఉద్దేశించి చెప్పిన పద్యములలో ఈ క్రింది పద్యము సుప్రసిద్ధమైనది. తెలుగుపై అభిమానమున్నవారు కంఠస్థము చేయవలసిన పద్యములలో ఇది ఒకటి. కాని ఇట్టి పద్యమే మఱొకటి భాగవతములో నవమస్కంధములో నున్నది. అది శ్రీరాముని సంబోధించినది. ఆ పద్యము- నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాశుగంబులన్ విల్లును దాల్చువాడు గడు విప్పగు వక్షమువాడు మేలు పై జల్లెడువాడు... »

Loading