వ్యాసమంజూష
వసుచరిత్రవైచిత్రి
విజయభావన, విజయనగరం 356 సభలో ‘వసుచరిత్రవైచిత్రి’ అనే విషయంపై శ్రీ కోటారావుగారి ప్రసంగం జరిగింది. ఆ ఉపన్యాససారం : వసుచరిత్ర పంచ మహాకావ్యాలలో ఒకటి. అన్నిటికంటే విశిష్టమైనది. ముఖ్యంగా తెలుగువారికి గౌరవం తెచ్చినది. అంతకు ముందు రచనలన్నీ సంస్కృతంనుండి అనువదింపబడినవి. పెద్దనగారి మనుచరిత్ర సైతం మార్కండేయ పురాణం నుండి తీసుకు వ్రాయబడినదే. ఆ రచనలు ఎంత గొప్పగా ఉన్నా, సంస్కృత పండిలులకు ఒక చులకనభావం ఉండేది. తెలుగు కావ్యాలకి స్వతసిద్ధశక్తిలేదనే అభిప్రాయం ఉండేది. అటువంటిది కాలంలో, వసుచరిత్ర... »
తెలుగు లెంక – శ్రీ తుమ్మల
(42వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా 15-11-2009 తేదీన విజయనగరంలో విజయభావన ఆధ్వర్యంలో జరిగిన సభలో శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్ గారి ఉపన్యాస వ్యాసం.) ” ఏ పుణ్య లేశమ్ము నాపాలిదాయెనో నా పూజ కేలోక నాథుండు పొంగెనో నీపావనోదరశ్రీ పరంపరలలో నీ పదార్చకులలో నేనొక్కడనైతి” అని అన్న, అనుకొన్న మహా కవి శ్రీ తుమ్మల సీతారామ మూర్తి చౌదరి. ‘నీ పదార్చకులలో నేనొక్కడ’ అన్నారు కనుకనే ఆయన ‘తెలుగు లెంక’. శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారు ఆధునికకవులలో పేరెన్నికగన్నవారు. ఇతను 1901 లో జన్మించారు.... »
అపూర్వ సాహితీ స్రష్ట – ఆదిభట్ల
ఈ క్రింది వ్యాసము గత నెల ముప్ఫయి ఒకటో తేదీన శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారి జన్మదిన సందర్భంగా శ్రీమతి బీ. హెచ్. దేవీప్రకాశ్ గారు వ్రాసినది. కారణాంతరాల వలన ఆలస్యంగా ప్రచురిస్తున్నందుకు క్షమాపణల తో – పద్యం.నెట్ ఈ యఖిలమ్మునందుఁబరమేశ్వరుఁ డెట్టులు నిండి యుండెనో యా యఖిలమ్ము వచ్చి తనయందున నుండెన యాదిభట్టనా రాయణదాసులో హరికథాకృతి భారతి సర్వశిల్పవి ద్యాయుత సంస్కృతాంధ్రముల యాకృతియై పెఱమూర్తులైమఱిన్ -శ్రీ విశ్వనాథ సత్యనారాయణ హరికథా పితామహునిగా శ్రీ ఆదిభట్ల నారాయణదాసు(31.08.1864 — 02.01.1945) లోకానికి సుపరిచితులు. ... »
పానశాల – అమర్ ఖయ్యాం ల వైశిష్ట్యము
వ్యాస రచయిత: శ్రీమతి భైరవభట్ల దేవీ ప్రకాష్ “తెలుగుందోటల బచ్చబీళ్ళ ననురక్తింబానశాలా ప్రతిష్ఠలు” గావించిన కవితా కృషీవలుడు కవికోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి. “భావనోద్యానమునందు”, రసోజ్వల మార్గమునాశ్రయించి, “రసార్ద్రీభూతచేతనమ్ముతో” ఉమర్ ఖయాం ను “అమర్ ఖయాం” గా మలచిన సుమ సుకుమార హృదయుడు డా|| కరుణశ్రీ జంధ్యాల పాపయశాస్త్రి. “పానశాల”, “అమర్ ఖయాం” కావ్యాలనడుమ సుమారు 60 సం||ల అంతరమున్నది. సహస్రాధికంగా ఉన్న ఖయ్యాం రుబాయీలను 125 పద్యాలుగా శ్రీ దువ్వూరి రచించేరు. కరుణశ్రీ 142 పద్యాలుగా... »
దాశరథి: రెండు పద్యాలు, కొన్ని ఊసులు
నాజీ నైజాం రోజులు. వరంగల్ సెంట్రల్ జైలు. హఠాత్తుగా ఒక అర్థరాత్రి తమ తమ వస్తువులన్నీ సర్దుకొమ్మని రాజకీయఖైదీలందరికీ ఆదేశం అందింది. ఖైదీలందరు నిజాం ప్రభువు నిరంకుశత్వాన్ని ఎండగడుతున్న కవులూ రచయితలూను. వారిలో “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్న అజరామరమైన మాటలన్న మహాకవి, నాటకకర్త, అనువాదకులు, వ్యాసరచయిత దాశథి గారు కూడా ఉన్నారు. అసలే నిజాం నిరంకుశుడు పైగా మూర్ఖుడు. ఉన్నఫళాన రాజకీయ ఖైదీలండరినీ మూటాముల్లే సర్దుకొమ్మని ఆదేశాలివ్వడం అంటే, వీరికి గుండేల్లో గుబులు... »
వృత్తౌచిత్యము పై శ్రీ కేరాగారి విమర్శనము
శ్రీ కేతవరపు రామకోటిశాస్త్రి గారి వృత్తౌచిత్య విచారములో వారు ప్రస్తావించిన కొన్ని విషయాలతో నేను పూర్తిగా ఏకీభవించ లేకపోయాను. క్షేమేంద్రుడు తన సువృత్తతిలకములో పేర్కొన్న వృత్తౌచిత్యము, సర్వత్ర సర్వధా వ్యాపన శీలమైన సిద్ధాంతము కాదనడంలో పెద్ద సందేహమేమీ లేదు. కానీ, తర్వాత వారు చెప్పిన ఈ క్రింది విషయాలు కొంత గందరగోళంగా ఉన్నాయి: “వృత్తములు గణముల మీద నిర్మింపబడినవి గనుక నా యా గణములవలన పద్యములలో వచ్చు భేదము లేకపోయినను, పరుషసరళాది, ద్విత్వసంయుక్తాది... »
కవిత్వము-చందస్సు
శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు “సాహిత్య శిల్ప సమీక్ష” అనే ఒక సాహిత్య విమర్శ గ్రంథం రాసారు. అందులో “కవిత్వము-ఛందస్సు” అనే వ్యాసంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను చర్చించారు. అందులోనుండి కొన్ని భాగాలు: “కవిత్వమునకు ఛందస్సు ఆవశ్యకమా, అనావశ్యకమా?” అను సమస్యను మన అలంకారికులు ఎన్నడును చర్చించనే లేదు. “ఇష్టార్థవ్యవచ్ఛిన్నమగు పదావళి కావ్యశరీరము.” అని నిర్దేశించిన ఆచార్యదండి మొదలుకొని “రమణీయార్థ ప్రతిపాదకమగు శబ్దము కావ్యము.” అని నిర్వచించిన జగన్నాథుని వరకుగల పండితులందరును రమణీయమగు రచనలన్నియు కావ్యములుగానే గౌరవించిరి కాని,... »
’తెలుగు కావ్యమాల’ పుస్తక పరిచయం
“తెలుగు కావ్యమాల” శ్రీ కాటూరి వెంకటేశ్వర రావు గారు సంకలనకర్తగా సాహిత్య అకాడమీవారు వెలువరించిన తెలుగు కవితా సంకలను. ఇది నన్నయ్య నూండి ప్రారంభమై కృష్ణశాస్త్రిగారి వరకు, అంటే షుమారు 11వ శతాబ్దము మొదలుకొని 1955 వరకూ వచ్చిన తెలుగు కవిత్వంలోని మేలైన కవితా ఖండికలను ఏర్చి కూర్చిన సుమహారం. కొండంత తెలుగు కవిత్వాన్ని చక్కగా ప్రతిబింబించే ఒక చిన్న అద్దం ఈ పుస్తకం. ఇందులోని విశేషాలలో ముఖ్యంగా నాకగుపించినవి: 1. శ్రీ కాటూరి వెంకటేశ్వర... »
