గోదావరీ పావనోదార…

Wednesday, October 21, 2009
By పద్యం.నెట్

గోదావరీ పావనోదార వాఃపూర
మఖిల భారతము మాదన్ననాడు
తుంగభద్రా సముత్తుంగరావము తోడ
కవుల గానము శ్రుతిగలుపు నాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ
శ్రేణిలో తెన్గు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్ర గానముతోడ
శిల్పము తొలిపూజ సేయునాడు

అక్షరజ్ఞానమెఱుగదో యాంధ్రజాతి?
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుక గూళ్ళు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు

- విశ్వనాథ సత్యనారాయణగారి ఆంధ్రప్రశస్తి నుండి.

వ్యాఖ్యానించండి

Loading