అక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్
….అని నేనలేదండీ! ఒట్టు. ఇది దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు సంకలనం చేసిన చాటుపద్యరత్నాకరము లోనిది. ఇది ఒక సమస్య. చాలా క్లిష్టం గా ఉన్నట్లుంది కదూ!
మోచర్ల వెంకన్న దీన్ని ఎంత చమత్కారంగా పూరించాడో చూడండి:
ఱక్కసి వలె ముప్రొద్దును
మొక్కుచుఁ దిరిగెదవు కాలిమెట్టున నిన్నున్
గుక్కక మానను దసినీ
యక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్
మొక్కుచుఁ దిరిగెదవు కాలిమెట్టున నిన్నున్
గుక్కక మానను దసినీ
యక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్
ఇదే సమస్యకు “తెలుఁగు సమస్యలు” – వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ అనే సంకలనం లో ఇంకో రకమైన పూరణ ఉంది. పూరించినవారెవ్వరో తెలియదు. చూడండి:
వక్కాకు మడిచివేసుక
చక్కెర విలుకానికేళి సలుపుద మనుచున్
చక్కని ముద్దుల మఱఁదలి
యక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్.
మరి మీరు కూడా ప్రయత్నించండి

సనత్ కుమార్
అక్కా చెల్లెండ్లిద్దర ు
మక్కువ తో నాలుమగల పాత్రలు జేసే
చక్కని నాటకమిచ్చెద
మక్కా! రమ్మనుచు ‘మగఁడు’ ‘నాలిం’ బిలిచెన్ !!
మగని వేషం లో ఉన్న చెల్లెలు సతి వేషం లో ఉన్న అక్కను రంగస్థలం పై నాటకం మొదలు పెడదాం రా అని పిలుస్తోంది.
సనత్ కుమార్ –
“ముక్కంటి బావ భార్యకు
అక్కా!” రమ్మనుచు మగఁడు నాలిం బిలువన్
“ఎక్కడ రవి నందన మీ
రెక్కడ” అనిపిల్చి భార్య రివ్వున నవ్వెన్.
“అమ్మా, జ్యేష్ఠా దేవీ ఎక్కడ తగులడ్డావు? రా” అని మొగుడు ఆకతాయిలా పిలిస్తే, “అయ్యా శని మొహం గారూ మీరెక్కడ ఉన్నారు” అని జవాబిచ్చింది కొంటె కోణంగి.
రవి–
సనత్ కుమార్ గారు,
సున్నం తెచ్చిమ్మని భర్త ఇలా అడిగాడు(ట).
పర్వత శ్రేష్టి పుత్రికా పతివిరోధి
యన్నపెండ్లాము నత్తను గన్న తండ్రి
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ!
సున్నమించుక తేగదే సుందరాంగి!
ఓ శనిదానా, సున్నం తీసుకురా అని అర్థం..
కంది శంకరయ్య
మిత్రులు పంపిన చమత్కార పద్యాలకు వివరణ …
తే.గీ. పర్వతశ్రేష్ఠపుత ్రికా పతి విరోధి
యన్న పెండ్లాము నత్తను గన్నతండ్రి
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ
సున్న మించుక తేఁగదే సన్నుతాంగి.
వివరణ: పర్వతశ్రేష్ఠపుత ్రిక-పార్వతి. ఆమె పతి-శంకరుడు. అతని విరోధి-మన్మథుడు. మన్మథుని అన్న-బ్రహ్మ. బ్రహ్మ పెండ్లాము -సరస్వతి. ఆమె అత్త-లక్ష్మి. లక్ష్మిని కన్నతండ్రి-సముద్రుడు. అతని పెద్దబిడ్డ-పెద్దమ్మ(దరిద్ర దేవత). “ఓ పెద్దమ్మా (దరిద్ర దేవతా)! సున్నం తే” అని అర్థం.
కం. శతపత్రంబుల మిత్రుని
సుతుఁ జంపినవాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతు వాహన వైరి వైరి సున్నంబిదిగో.
వివరణ: శత్రములు-తామర పూలు. వాటి మిత్రుడు-సూర్యుడు. అతని సుతుడు-కర్ణుడు. కర్ణుని చంపినవాడు-అర్జునుడు. అతని బావ-కృష్ణుడు. అతని సూనుడు-ప్రద్యుమ్నుడు(మ న్మథుడు). మన్మథుని మామ-చంద్రుడు. చంద్రుని తలదాల్చినవాడు-శివుడు. అతని సుతుడు-వినాయకుడు. వినాయకుని వాహనం-ఎలుక. దాని వైరి-పిల్లి. పిల్లికి వైరి-కుక్క. “ఓ కుక్కా! ఇదిగో సున్నం” అని అర్థం.
జిగురు సత్యనారాయణ
చక్కంగనుండు పచ్చడి
గ్రక్కున వాడు పలనాటి కారము వలనన్
మక్కువ మీరగ తెచ్చితి
నక్కారమ్మనుచు, మగఁడు నాలిం బిలిచెన్
ఆ + కారమ్ము + అనుచు = అక్కారమ్ము + అనుచు = అక్కారమ్మనుచు ( త్రిక,ఉకార సంధులు)
జిగురు సత్యనారాయణ
పెక్కగు మందుల కంటే
కిక్కెక్కువనిచ్ చునాలి క్రీఁగను చూపుల్
నిక్కము సతియే మందుల
కక్కారమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్!!
మందులకు+అక్క+ఆ+ రమ్ము+అనుచు = మందులకక్కారమ్మన ుచు
{మందులన్నిటికి అక్క అయిన ఆ రమ్ము (ఒక మందు Brand) యే తన భార్య అని తలచి…}
సనత్ కుమార్
ఎక్కాల లోని కిటుకులు
పక్కా వ్యాపారి వోలె పట్టితి, నీకున్
చక్కగ నేర్పెద, రా! స
మ్మక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్!!
కామేశ్వర రావు
“ముక్కంటి బావ భార్యకు…” పూరణ సరసంగా ఉంది.
“చక్కంగనుండు పచ్చడి…” పూరణ చమత్”కారంగా” ఉంది.
“పెక్కగు మందుల కంటే…” పూరణ “రమ్”యంగా ఉంది. ఈ పూరణ చదివాక నాకీ గజల్ గుర్తుకొచ్చింది !
“नज़र नज़र से मिलाकर शराब पीते हैं
हम उनको पास बिठाकर शराब पीते हैं”
సనత్ కుమార్
అక్కున జేరిన దొకసతి
మక్కువ తో నెత్తినెక్కె మరియొక సతియున్
ఫక్కున నవ్వులు చిందగ
అక్కా ! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్ !!
chandramohan
మక్కువతో నన్నొక పరి
చక్కగ పిలవండటన్న సతితో, సిరులన్
మిక్కిలిగ యొసగు లక్ష్మికి
అక్కా! రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్
చక్కని వంటల చేయుచు
గ్రక్కున బెట్టితివి గాని గారెల కారం
బెక్కువ యయ్యెను తినలే
నక్కారమ్మనుచు మగాడు నాలిన్ పిలిచెన్