చంద్రికా వర్ణనము – తిక్కనసోమయాజి

Thursday, October 22, 2009
By పద్యం.నెట్
క్రింది పద్యాలు తిక్కన సోమయాజి గారి నిర్వచనోత్తర రామాయణం నుంచి సంగ్రహింపబడినవి.  వీటిలో అన్ని పద్యాలకు గాని, లేక కొన్ని పద్యాలకు గాని తాత్పర్యం/వివరణ వ్రాయమని విజ్ఞులైన చదువరులను పద్యమ్.నెట్ ఆహ్వానిస్తోంది.  భవిష్యత్ పాఠకుల సౌకర్యార్థం, మీరు వ్రాసిన తాత్పర్యాదులతో ఈ పుటను పద్యమ్.నెట్ తాజాకరిస్తూ ఉంటుంది. మీ సహకారానికి ముందుగా ధన్యవాదాలు!
ఈ పద్యాలను PDF రూపంలో చదవదలుచుకునేవారు ఇక్కడ నొక్కండి.

చంద్రికా వర్ణనము – తిక్కనసోమయాజి

నిర్వచనోత్తర రామాయణం నుంచి

పంబిన పెంపుఁబాసి, దివిఁబ్రాకి, దిశల్ వెలిఁగించి, చంద్రకాం

తంబుల నీరుసేసి, కుముదంబులఁ బండువుసేయఁబంచి,

బ్జంబుల నిద్రవుచ్చి, మరుసాయకముల్ గరసానఁబట్టి, కో

కంబులనేచి లోకముపొగడ్తలుసేకొని చంద్రుఁ డున్నెడన్.                           1

తినుగమి నొల్లక యొకయెడఁ

దన యిచ్చకువచ్చు నిందుధామని కాయం

బున మవ్వమెక్కి నిగిడెది

కొనలు గమిచి మేసెనొక చకోరము దివుటన్.                           9

బడి చేసిన చందంబునఁ

గడువేగం బొకటినొకటిఁ గదిసి దివిని సం

దడిగా నెంతయు గుంపుగఁ

బడి వెన్నెలకుం జకోపరం కులు గవిసెన్.                                        2

సమ్మదవారి కంగడల జాలుగ, మైపారుగ, నిదుబిం

బమ్మున దృష్టినిల్పి, పయిఁబ్రాఁకు మరీచుల నూఁగుఁగులేఁ

గొమ్మలు వట్టి చంచుపుటకోటిఁ గదల్చి తెమల్చికొంచు సౌ

ఖ్యమ్మ విహంగమమ్మయినయాక్రుతినొందెఁజకోరమొక్కెడన్.                10

మునుమును నెగ డెడురశ్నుల

కొన లెల్లం బట్టికొని చకోరంబులు ద్రుం

చిన నచట నచటఁ దుఱఁగలి

గొని పెరిఁగెడుమాడ్కి దలముకొని ప్రభ లెగసెన్.                      3

కలయఁగ నూనునట్లుగ జగంబు సమస్తముఁ జాలఁ దోఁగెనో,

జలజభవుండు గోరి పెఱచాయల నెల్లను మాంచి యెందునుం

దెలుపు ఘటించెనో, యమౄతదీధితి వేడుక విశ్వరూపుఁడై

నిలిచెనొ నాఁగ నెల్లెడల నిండఁగ వెన్నెల పర్వె సాంద్రమై.                        11

తివిచి నవకంబుదీప్తులు ద్రెంచి, యలఁతి

తునియలుగఁ జంచుపుటములఁ ద్రుంచి తల్లు

లాదరంబున నంది యీ నఱ్ఱులెత్తి

ప్రీతిఁ గముచుఁ జకోరంపుఁ బిల్లగములు.                              4

వెన్నెలపోఁతపనులొ యన,

వెన్నెలగండరువుపనుల విధమున, మీఁదన్

వెన్నెల నీరు వఱపిరనఁ

గన్నుల కింపొఁగె సకల రూపములున్.                                            12

చంచులఁ గాంతులు వెన్నెలఁ

జించి యమృతముట్ట నొసఁగుచెన్నునకును రా

గించుచుఁ జవి ఁజొక్కుచుఁ గబ

ళించుఁ జకోరికలు సమదలీలాసలై.                                      5

అలసతయొప్ప నల్లన రతాంతమునం బ్రియునొద్దఁబాసి, నె

చ్చెలికడ కేగుదెంచు సరసీరుహనేత్ర విలోచంబులన్

దలఁకెడు మందహాసమువిధంబున సొంపున మీఱియిన్న చెం

గలువలలోన నింపడరుకౌముది వేడ్కలొనర్చెఁజూడ్కికిన్.                 13

క్రమ్మి పైఁ దొరఁగెడు కౌముదితీయంబు

సొంపునఁ దనుపునఁ జొక్కి చొక్కి

పచరించు చంద్రాతపంబుకాలువలలో

బడ్డంబుగా నిల్చి యాఁగి యాఁగి

వెల్లువ పెల్లుసూపెడు సౌంద్రచంద్రికా

పూరంబు గని మదిఁ బొంగి పొంగి

మిన్నులతో రాయు వెన్నెల కరడుల

నెఱకలు సదలించి యీఁది యీఁది                                     6

భరితసుధారసపాత్రంబులను కుము

దోత్కరంబులు దళుకొత్త మెఱసి

చంద్రకాంతోపలజలముల కాలువ

లివి యవి యని యప్పుడేర్పరించి                                         14

చెలఁగి చెలఁగి, మలఁగి మలఁగి, యల్లల్లన

క్రాలిక్రాలి, బిట్టు తూలితూలి

సమదవృత్తిఁ గేలిసలిపెఁ జకోరచ

యంబు సదలు దమమయంబు గాఁగ.                               7

దెసలు సూడగఁగ గుండె దిగ్గను చక్రస

మాహారంబునకుఁ దలమునుక లగుచు

నీఁదుచకోరంబు లెగురవ్రేఁగై యీడి

గిలఁబడునట్లుగా దలముకొనుచు                               15

తడఁబడ నొండొంటికి ము

న్నెడఁ గముచుచు, నొడిసికొనుచు, నేపునఁబైపైఁ

బడుచు, నవులవుల నీసునఁ

గడచుచు వెన్నెలఁ జకోరగణ మానునెడన్.                          8

నంతకంతకుఁ బొంగి, మిన్నంది, వెల్లి

మిగిలి, యెనిమిదిదిక్కులమీఁదఁ బొరలి

జనము లానందమునఁ దేల జగములెల్లఁ

దొట్టి నిండారు వెన్నెల నిట్టవొడిచె.

Tags:

వ్యాఖ్యానించండి

Loading