బ్లాగు మంజూష

ఈ పేజీ లో పద్య సంబంధిత తెలుగు బ్లాగుల సంకలిని. మీ పద్య సంబంధిత బ్లాగును ఇక్కడ కలిపేందుకు, మీ బ్లాగు వివరాలతో editor@padyam.net కు వేగు పంపండి.

బ్లాగుమంజూష (1 - 25 of about 310) (xml) (Feedlist)

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం (04.09.2010 15:01h): సరస సల్లాపము - 4

1954 నాటి మాట.అప్పటికింకా ’ఆంధ్ర ప్రదేశ్’ రాష్ట్రం ఏర్పడలేదు.మహాకవి దాశరథి విశాలాంధ్ర ఆయన దానిని ’మహాంధ్ర’ అనడానికి ఇష్టపడేవారు ను ఆకాంక్షిస్తూ, ’మహాంధ్రోదయం’ కావ్యాన్ని రచిస్తున్నారు. " నేనురా తెలగాణ నిగళాల తెగద్రొబ్బి ఆకాశమంత ఎత్తార్చినాను - నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను - నేను పోతన కవీశాను గంటములోని ఒడుపుల కొన్నింటి బడసినాను - నేను వేస్తంభాల నీడలో నొక తెన్గు తోట నాటి సుమాల దూసినాను - " అని సీస పద్యాన్ని ఆయన పూర్తి చేసి, పైన ’ఎత్తు గీత పద్యం’ వ్రాయడానికి ఉపక్రమించారు." కోటిమంది తెలంగాణ ప్రజలకు రెండు కోట్ల ఆంధ్రా ప్రజల గురించి వివరాలు తెలియజెప్పి, ఆ మూడు కోట్ల ప్రజల ఆ రోజుల్లో అక్కడ, ఇక్కడ కలిపి మొత్తం తెలుగు వాళ్ళ జనాభా మూడు కోట్లు గొంతుల నొక్కటి చేసి, వారి ప్రతినిధిగా తాను ’మహాంధ్ర గీతా’న్ని ... [Link] [Cache]

Dr.Acharya Phaneendra (02.09.2010 18:55h): విశాల భాస్వంత చరిత్ర

విశాల భాస్వంత చరిత్ర రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర హైదరాబాదులోని ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం’ యొక్క 110వ వ్యవస్థాపక దినం సందర్భంగా … 2010 సెప్టెంబర్ 1,2,3 తేదీలలో నిర్వహించబడుతున్న వార్షికోత్సవాలలో … మొదటి రోజు … ప్రారంభ సమావేశంతోబాటు, డా. నిడమర్తి నిర్మలాదేవి రచించి, సమర్పించిన ’భామినీ భువన విజయం’ సాహిత్య రూపక ప్రదర్శన జరిగింది. ఇందులో డా. నిడమర్తి నిర్మలాదేవితోబాటు డా. వేలూరి రేణుకాదేవి, డా. రాజలలిత, డా. కుసుమకుమారి, శ్రీమతి రమణ కుమారి, శ్రీమతి భారతీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు … ’తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసం’ అన్న అంశంపై సదస్సు నిర్వహించబడింది. దీనికి సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావు అధ్యక్షత వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ’రిజిస్ట్రార్’ ఆచార్య టి. గౌరీశంకర్, ’ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక సంపాదకులు డా. కె. శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి ... [Link] [Cache]

తెలుగు పద్యం (01.09.2010 04:01h): గ్లోబల్ దేవుడు గోవిందుడే!

శ్రీకైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నానా కంజాతభవాండకుంభకు మహానందాంగనా డింభకున్అంతర్జాతీయ "గుర్తింపు" పొందిన మన ఒకే ఒక్క దేవుడు శ్రీకృష్ణుడు! :- తిరుపతి వెంకన్నకి కూడా ప్రపంచమంతా పెద్ద భక్తబృందమే ఉంది కాని, అతని పేరిట అంతర్జాతీయ సంస్థ లేదు కదా! పైగా ఆ వెంకన్న భక్తులు కూడా నిత్యం "గోవింద" నామస్మరణే కదా చేస్తారు! [Link] [Cache]

Dr.Acharya Phaneendra (14.08.2010 04:39h): à°

చంద్ర శేఖర్ ’ఆజాద్’ రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర “ఎప్పటి కాంగ్ల జవానుల గుప్పిట చిక్కుటకు నొప్పకుం ’దాజాదున్’ ! తప్పి ఒకవేళ, చిక్కక తప్పనియెడ ఆత్మహత్య తలదాల్తు” నటన్ - ’ఓవరు కోటు’ జేబునెపు డొక్క బులెట్టును దాచియుంచుచున్, చావుకు సిద్ధమై – భరత జాతి విముక్తికి పోరు సల్పుచున్, చేవను జూపినా డతి విశేష మహోన్నత దేశ భక్తితో - పావన ’చంద్ర శేఖరుడు’ – భారత మాతకు ముద్దు బిడ్డడై ! ’భగతు సింగు’ వంటి భారత స్వాతంత్ర్య వీర వరుల కతడు దారి చూపె - పోరు బాటలోన ముందుండి నడిపింప - బ్రిటిషు గుండె లదరి బెదరి పోయె ! తులసి వనమందు గంజాయి మొలచినట్లు అతని అనుచరులందొక్క డయిన వాడె బ్రిటిషు వారు రాల్చిన ’కుక్క బిస్కటు’ తిని అతని ఆచూకి వారికి నందజేసె ! ఒంటరిగా నొక ... [Link] [Cache]

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం (11.08.2010 12:08h): సరస సల్లాపం - 3

1960.. 70 ల నాటి సంగతి. నా చిన్ననాట ... మా పెద్దలు చెప్పుకొంటుంటే విన్న మాట! అప్పటికి ప్రసార సాధనాలుగా ఉన్నవి వార్తా పత్రికలు మరియు ఆకాశవాణి మాత్రమే. అవీ అంతంతమాత్రంగానే ఉండేవి. ఆ రోజుల్లో ప్రసిద్ధ కవి, ’పోతన చరిత్రము’ మహాకావ్య కర్త, డా. వానమామలై వరదాచార్యులు క్షయ వ్యాధి సోకి, చాలా జబ్బుపడ్డారు. అంతలో ఎవరో ఆగంతుకుడు ఆనాటి యువకవి, ఔత్సాహికుడు అయిన సి. నారాయణరెడ్డికి ఆచార్యులవారు పరమపదించినట్టుగా వార్త మోసారు. అశనిపాతంగా తాకిన ఆ వార్తకు ఎంతో కుందిన నారాయణరెడ్డి కవి వెంటనే సంతాప సభకు ఏర్పాట్లు చేసారు. కాని... నిజానికి ఆ వార్త అసత్యం. వరదాచార్యులవారు అప్పుడే కొద్దిగా కోలుకొన్నారు. ఇంతలో మరొక వార్తావహుడు ఈ విషయాన్ని ఆచార్యులవారికి అంటించాడు. ఆచార్యులవారు కోపంతో ఊగిపోతూ, సంతాపసభ కరపత్రాన్ని చేతిలో పట్టుకొని, సరిగ్గా సభామందిరంలోకి అడుగుపెట్టారు. అక్కడ సభాసదులు వక్తలతోబాటు యువకవి నారాయణరెడ్డి ఈ విషయం ... [Link] [Cache]

తెలుగు పద్యం (08.08.2010 14:25h): తెలుగు పద్యము తన పెద్దదిక్కు నీగె!

ఒకోసారి కొంతమందితో మనకి ప్రత్యక్ష పరిచయం లేకపోయినా మన మీద గాఢమైన ప్రభావాన్ని చూపుతారు, మనకి ఆత్మీయులవుతారు. సాధారణంగా ఇలాంటి బంధం ఒక రచయితకీ పాఠకునికీ మధ్య ఏర్పడుతూ ఉంటుంది. ఇది ఏకపక్షం. పాఠకునికి రచయితతోనే ఉండేది. నన్నలా ప్రభావితం చేసిన వారు శ్రీ కోవెల సంపత్కుమారాచార్యగారు.ఛందస్సులో నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానానికి దోహదం చేసిన పుస్తకాలలో కోవెలవారి తెలుగు ఛందోవికాసము ముఖ్యమైనది. ఇది ఛందస్సుకి [Link] [Cache]

Dr.Acharya Phaneendra (08.08.2010 10:44h): ” à°¶à±

శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ద్యుత్సవ సమాప్తి సందర్భంగా రాయల వారి ప్రశస్తి కవిత : ” శ్రీకృష్ణరాయ నృపా ! “ రచన : ’పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర వీర, సార భూమి విజయ నగరమందు తెలుగు ధీర యుక్తి, ధిషణ శక్తి ఒక్క రూపమందె ఉద్దీపనము చెంద ’కృష్ణ రాయ’డగుచు కీర్తి నొందె ! కత్తి కలమ్ముగా సమర కావ్యమునన్ రుధిరాక్షరంబులన్ విత్తగ ’కృష్ణ రాణృపుడు’, విక్రమ గీతులు పొంగు ! ఆతడే మెత్తని పాళి గల్గు కలమే ఝళిపింపగ కత్తిగాన్, సిరా హత్తుకొనంగ, కావ్యమె మహాద్భుతమౌ రస యుద్ధమయ్యెడిన్ ! రాజ సూర్యుడు, కవిరాజునున్ రెండయి - తెలుగు రాజ్య రమకు దీప్తి గలుగ - దిద్దె వీర రక్త తిలక మామె నుదుట ! అద్దె కవన మధువు నామె నోట ! అష్ట దిగ్గజాల్ మోయగా, ఆంధ్ర సాహి తీ ప్రబంధ ... [Link] [Cache]

Dr.Acharya Phaneendra (06.08.2010 07:54h): à°¦à±

దీపమారిన చీకటి తీరమందు … రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర కోవెల వంటి ఇంట, ఘన ‘కోవెల’ నామ కులీన దీపమై, ‘కోవెల సోదర ద్వయము’ కుందులలో కుడి ప్రక్క దానిలో నీవు ప్రకాశమొందితి, వినిర్మితి జేయుచు కావ్య కాంతులన్ - కోవెల సంపతార్య ! మది కోవెల జేసియు వాణి గొల్వగన్ ! ‘కాలస్పృహ’, ‘అంతర్మథ నా’లను కూర్చితివొ – ‘చేతనావర్తము’లై ఆలాపించగ ‘హృద్గీ తా’లయె, ‘ఆనంద లహరి’ తాండవమాడన్ ! విశ్వవిద్యాలయాచార్య ! విబుధ వర్య ! తీర్చి విద్యార్థి గణములన్ దిద్దినావు ! లక్ష్య శుద్ధి నల్లితి పల్ విలక్షణమగు కవన లక్షణ సువిమర్శ గ్రంథములను ! ఇంపారగ వెలయించుచు సొంపగు వ్యాఖ్యానములను స్ఫూర్తి, కృతులకున్ - సంపత్కుమార వర ! ఘన సంపత్తిని కూర్చి తాంధ్ర సాహిత్యమునన్ ! ఖ్యాతి నొందితి పరిశోధకాగ్ర మణిగ ! సాటి లేని విమర్శక ! ... [Link] [Cache]

Dr.Acharya Phaneendra (31.07.2010 10:30h): à°

ఎవ్వరివో ! రచన : డా . ఆచార్య ఫణీంద్ర ఎవ్వరివో ! నీ వెవ్వరివో ! ఎవ్వరివో ! నీ వెవ్వరివో ! నా గుండెను దోచిన జవ్వనివో ! నా గుండియ మ్రోసిన సవ్వడివో ! జక్కన చెక్కిన శిల్పమువో ! తిక్కన చేసిన కల్పనవో ! రాజా రవివర్మ చిత్రమువో ! త్యాగరాజు మధుగాత్రమువో ! అన్నమయ్య పద కీర్తనవో ! సిద్ధేంద్రుని పద నర్తనవో ! రుద్రమ దేవీ ప్రతాపానివో ! గౌతమీ నదీ ప్రవాహానివో ! వేయి ఆమనుల తెలుగువో ! రేయి చంద్రికల వెలుగువో ! వాణి పాదముల అందెవో! వేల్పుల అమృతపు బిందెవో ! — *** — [Link] [Cache]

Dr.Acharya Phaneendra (28.07.2010 10:35h): à°

అశీతి జన్మదినాన - అభినందన ! ఎవని నామము నాంధ్రు లెవరు విన్నను చాలు కనులు గర్వమ్ముతో కదలుచుండు - ఎవని వాగ్విభవ మ్మొకింత కన్నను చాలు పులకించి కర్ణముల్ పురులు విప్పు - ఎవని కైతల రాణి ఇంపు సొంపుల గాంచి రస రమ్య హృదయాలు ’ఖుషి’ని బొందు - ఎవని ప్రఖ్యాతి ఖండేతరంబుల గూడ మోడ్చినట్టి కరాల మ్రొక్కు లందు - ఎవనిచే కృతు లావిష్కరింప గోరు - ఎవని కాతిథ్య మిడ సభ లిచ్చగించు - ప్రియతముడు – ’ సి.నారాయణ రెడ్డి ’ యతడు ! కావ్య జగతిలో బంగారు కడ్డి యతడు !! ’సాగరము’న గాంభీర్యము, త్యాగము ’కర్పూర’ మందు – దర్శనమయ్యెన్ రాగము ’మట్టి’ని, ’మనిషి’ని - వేగము నీ సత్కవిత్వ ’విశ్వంభర’లో ! మాటకు, పాటకు, మట్టికి - ధాటిగ నమ్మిన మనిషికి దండ మటంచున్ చాటిన తత్త్వజ్ఞ ఘనా పాటివి ... [Link] [Cache]

Dr.Acharya Phaneendra (26.07.2010 19:29h): à°

27 జులై .. ఈ రోజు … నా పుట్టిన రోజు ! 1961 వ సంవత్సరంలో ఇదే రోజు ఆనాడు గురు పౌర్ణమి నేను ’ఇందూరు’ నిజామాబాదు లో జన్మించాను. ఈ రోజుతో నాకు 49 సంవత్సరాలు పూర్తయి, ఇది నా 50 వ జన్మదినం. ఈ రోజు ముందుగా నాకు జన్మనిచ్చి నన్నింతవాణ్ణి చేసిన నా తల్లిదండ్రులను స్మరించుకొని, పరమపదంలో ఉన్న వారిరువురికి అంజలి ఘటిస్తున్నాను. ఇక … నాలోని సాహిత్యాభినివేశాన్ని గుర్తించి, నన్ను శిష్యునిగా స్వీకరించి, మంచి పద్య కవిగా తీర్చిదిద్దిన మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల వారికి కూడా వినమ్రాంజలి సమర్పించుకొంటున్నాను వారిప్పుడు భౌతికంగా నా చెంత లేకున్నా, వారు నాపయి వర్షించిన ఆశీరభినందనలు నాకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయి. అవి … విమల కవిత చెప్పు విద్యుల్లతలు పేని – మానవత్వమునకు మచ్చు తునక! ఎవని ఎడద కరిగి ప్రవహించు మెదడులో - అతడు ... [Link] [Cache]

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం (26.07.2010 10:43h): ఆణిముత్యం జులై 2010

చదువుకొన్నవాడు, సంపన్నుడగువాడుచేయ తప్పు - శిక్ష వేయవచ్చు!పేదవాని తప్పు ఔదార్య హృదితోడ సైపవలయు మనుజ సంఘమెల్ల!ఈ ఆణిముత్యం మా గురువు గారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య కలం నుండి జాలువారినది.విద్యావంతుడు, ధనవంతుడు చేసే తప్పు తెలిసి.. తెలిసి చేసే తప్పు. పైగా "నన్నెవడు అడిగేవాడు?" అన్న అహంకారంతో చేసేది. కాబట్టి అది క్షమార్హం కాదు. కానీ ... పేదవాడు చేసే తప్పు, వాడు చేసేది కాదు. వాని ఆర్థిక స్థితి గతులు వానితో తప్పును చేయిస్తాయి. కాబట్టి ఆ ఆర్థిక అసమానతలకు మూల కారణమైన సంఘానిదే ఆ తప్పు. అందుకే అది శిక్షార్హం కాదు. ఆ తప్పును మనుజ సంఘం తనదిగా భావించి, భరించాలంటారు కవి.సరళ సుందరంగా, అభ్యుదయాత్మక సందేశం ఇమిడిన ఇలాంటి పద్యాలే మా గురువు గారిని ’ఆధునిక వేమన’గా మన్ననలందుకొనేందుకు దోహదపడ్డాయని నా భావన!- డా. ఆచార్య ఫణీంద్ర సంపాదకుడు [Link] [Cache]

Dr.Acharya Phaneendra (22.07.2010 11:06h): â

‘మహాకవి దాశరథి’ గురించి ఆయన సోదరులు ‘రంగాచార్య’ గారితో ముఖాముఖి పరిచయకర్త : డా. ఆచార్య ఫణీంద్ర ‘సాహితీ కౌముది’ పత్రిక ‘అక్టోబర్ 2002′ సంచికలో ప్రచురితం 22 జులై 2010 నాడు డా. దాశరథి గారి 83వ జయంతి సందర్భంగా post చేయబడినది [Link] [Cache]

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం (21.07.2010 01:47h): డా. దాశరథి పై డా. సి.నా.రె. వ్రాసిన స్తుతి పద్యాలు

ఈ మాసం పద్య కవిత జులై 2010 దాశరథీ! మనోజ్ఞ కవితా శరధీ! శరదిందు చంద్రికాపేశల కావ్య ఖండముల పిండిన నీ కలమందునన్ మహోగ్రాశనిపాతముల్ వెలయు నౌర! మహేశుని కంటిలో సుధారాశి తరంగముల్, కటు హలాహల కీలలు పొంగినట్లుగాన్!నా తరుణ కావ్య లతిక లానాడు పైకిప్రాక లేక దిక్కులు సూడ, నీ కరాలుసాచి, లేత రేకులకు కెంజాయ లద్ది,మించు పందిళ్ళ పైకి ప్రాకించినావు! రచన : డా. సి. నారాయణ రెడ్డి సేకరణ : డా. ఆచార్య ఫణీంద్ర 22 జులై - డా. దాశరథి గారి జయంతి సందర్భంగా ... [Link] [Cache]

Dr.Acharya Phaneendra (10.07.2010 23:01h): ‘à°

‘ అమ్మ’ బొమ్మ రచన: ‘పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర గీతమాలిక : మహిని సృజియింప తొలుదొల్త ‘మాతృమూర్తి’ తలమునుకలునై ‘శ్రీహరి’ దైవముండె ! స్వామి ఏకాగ్రతయు, దీక్ష – సాధ్వి ‘లక్ష్మి’ కాంచి, తుడిచి స్వేదమ్ము చేలాంచలమున, ” అంత విశ్వంబు సృష్టించునపుడు గూడ ఇంతగాను శ్రమించి మీ రెరుగబోరు ! కొంచె మెక్కువే కష్టంబు కోర్చి, మీరు అతిగ ఆయాసపడుచుంటి ” రనిన – అతడు ” అవును ! నే తీర్చుచున్నట్టి ‘అమ్మ’ బొమ్మ నూట ఎనిమిది కీళ్ళతో నుండి కదులు ! ఆరు జతల హస్తా, లింక ఆరు కళ్ళు - మిగులు తిండితో ఇవియన్ని మెదలవలయు - ఊపునూయలై పాపాయి నొక్క చేయి - ఒలికి జలము, ‘లాలలు’ పోయు నొక్క చేయి - ‘ఉంగ’ యని నోట బువ్వొత్తు నొక్క చేయి - దిద్ది తీరుచు నొక చేయి దిష్టి ... [Link] [Cache]

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం (06.07.2010 06:43h): సరస సల్లాపం - 2

మా గురువుగారు కీ.శే. నండూరి రామకృష్ణమాచార్య గోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన గురువుగారు డా. కట్టమంచి రామలింగారెడ్డి రాయలసీమకి చెందినవారు. ఒకరోజు నండూరివారు తమ ప్రాంతానికి చెందిన ఆదికవి నన్నయ గురించి గొప్పగా చెప్పుకపోతున్నారు. అది విని కట్టమంచివారు తమ ప్రాంతానికి దగ్గరలో ఉన్న నెల్లూరుకు చెందిన తిక్కన చాలా గొప్పకవి అని వాగ్వివాదానికి దిగారు. చర్చ కొద్దిగా వేడెక్కింది. రామలింగారెడ్డిగారు " ఏమిటయ్యా మీ నన్నయ గొప్ప ?పద్యమంతా సంస్కృతం పులమడమేనా ? మా తిక్కనను చూడు - తేట తేట తెలుగు మాటలలో ఎంత చక్కగా వ్రాస్తాడో - " అన్నారు. దానికి నండూరివారు తిక్కన వ్రాసిన "దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ ... " అన్న పద్యాన్ని ఉటంకిస్తూ, " ఇది సంస్కృతం పులమడం కాదేమిటి ? " అని అడిగారు. అప్పుడు రామలింగారెడ్డిగారు ఏం మాట్లాడాలో తెలియక ... [Link] [Cache]

తెలుగు పద్యం (05.07.2010 16:12h): దీర్ఘ విరామం తర్వాత - "దీర్ఘ వాసరా"ల గురించి

ఈసారి బ్లాగుకి కాస్త సుదీర్ఘమైన విరామమే వచ్చింది! బ్లాగుకైతే దూరమయ్యాను కాని తెలుగు పద్యానికి కాదు. ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పద్యాన్ని తలుచుకోకుండా రోజే గడవదు. అలా ఈ మధ్య తలచుకున్న పద్యం ఇది:నలదమయంతులిద్దరు మనఃప్రభవానల బాధ్యమానలైసలిపిరి దీర్ఘవాసర నిశల్ విలసన్నవ నందనంబులన్నలినదళంబులన్ మృదుమృణాలములన్ ఘనసారపాంసులన్దలిరుల శయ్యలన్ సలిలధారల జందనచారుచర్చలన్ఇది నన్నయ్యగారి పద్యం. మహాభారతం అరణ్యపర్వంలోది. [Link] [Cache]

Dr.Acharya Phaneendra (04.07.2010 06:19h): à°

కవాటోపాఖ్యానము రచన: ‘పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర ఎట్టి హర్మ్యమైన – ఏ చిన్ని ఇల్లైన - ముఖమువోలె నద్ది ముందు నిలుచు ! గదికి గదికి నడుమ కలిపి సంధానమ్ము, మధ్యవర్తివోలె మైత్రి గూర్చు ! తలపులందు దాని తెలుసుకొంటిరొ ? లేదొ ? ‘తలుపు’ సుమ్మి అద్ది ద్వారమందు ! మూసియున్న – మనము ముక్తి బొందినయట్లె ! తెరచుకొన్న – హృదులు తెరచినట్లె ! అది గవాక్షమైనను, ద్వారమైనగాని ఈ కవాటమ్ములే లేనియెడల కనుడు - పక్షములు లేని విహగాల భంగి తోచు ! తెలియరే తలుపులకున్న విలువనింక ? ఒంటిగనుండు నొక్కకడ – ఉన్నతదీక్షను బ్రహ్మచారియై ! జంటగనుండు నొక్కకడ – సంగమమొందుచు రాత్రులందునన్ ; మింటను సూర్యుడే పొడువ, మేనులు వీడి పవళ్ళు నిల్చి, క్రీ గంటను చూచుకొం చెదురుగా, యువదంపతులట్లు కుల్కుచున్ ! పొందుగోరెడి దంపతుల్ ముందు , వాని ... [Link] [Cache]

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం (02.07.2010 11:07h): సరస సల్లాపము - 1

నిన్న నా పాత మిత్రుడైన ఒక అర్ధజ్ఞాని కలిసాడు. ’జ్ఞాని’ విన్నాం - ’అజ్ఞాని’ విన్నాం. ఈ ’అర్ధజ్ఞాని’ ఏంటి - అనుకొంటున్నారా ? సగం తెలిసి, సగం తెలియనివాణ్ణి ఏమనాలో తెలియక ఆ పదబంధాన్ని సృష్టించాను మరి.రావడం, రావడమే వాడు నాపై దాడి చేస్తూ, " మీ కవులు - ఎక్కడో ఆకాశంలో ఉన్న సూర్యునికి, నేలపై కొలనులో ఉన్న కమలానికి సంబంధాన్ని అంటగడతారు. వాటి మధ్య ప్రేమ ... దోమ ... అంటూ కథలు చెబుతారు. నిజానికి సూర్యుని దగ్గరగా కమలం వెళితే చచ్చి ఊరుకొంటుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే, మాడి మసైపోతుంది. " అన్నాడు." దాన్ని ’కవి సమయం’ అంటారు నాయనా ! సూర్యుని కిరణాలు సోకి, కమలం ఆనందంగా వికసిస్తుంది కాబట్టి అది సూర్యునికి ప్రేమికురాలుగా మనం భావించాలి. అంతే! " అని వివరించాను. వెంటనే వాడు " కమలం ప్రేమికురాలైతే ... మరి ’పొద్దు ... [Link] [Cache]

Dr.Acharya Phaneendra (01.07.2010 11:46h): à°®à±

నా ‘వరాహ శతకము’ కృతికి రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త డా|| కె. వి. రమణాచారి IAS గారు అందజేసిన ముందుమాట: [Link] [Cache]

నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం (30.06.2010 12:28h): సమస్యను పరిష్కరించండి ... జులై 2010

'సమస్యా పూరణం' పద్య కవులకు మంచి వినోదమే కాకుండా చక్కని అభ్యాసాన్ని, చమత్కారయుత సృజన శక్తిని అందిస్తుంది.చాలా రోజులు ఈ శీర్షికను నిర్వహించడంలో ఆటంకం ఏర్పడినందుకు మన్నించండి. మళ్ళీ ఇదివరకులాగే ఈ శీర్షికను విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తూ ...ఈ మాసం సమస్య :" కోడిని కరకర నమిలె కోడలమ్మ! "పై సమస్యను పరిష్కరించి, పూరణ పద్యాన్ని వ్యాఖ్య ద్వారా అందించండి.- డా. ఆచార్య ఫణీంద్ర సంపాదకుడు [Link] [Cache]

Dr.Acharya Phaneendra (27.06.2010 09:17h): నా కొత్త పుస్తకం…

నా కొత్త పుస్తకం – ” వరాహ శతకము “ ముద్రణ పూర్తయింది. గ్రంథం అందంగానే వచ్చిందని భావిస్తున్నాను. ముఖ చిత్రాన్ని చూడండి. అట్ట నాలుగవ పేజీని చూడండి. బహుశః వచ్చే నెల 25 వ తేది గురు పూర్ణిమ – నా పుట్టిన రోజు నాడు గ్రంథావిష్కరణ జరుగవచ్చు. బ్లాగు మిత్రుల ఆశీస్సులను కోరుతూ … భవదీయుడు ఆచార్య ఫణీంద్ర [Link] [Cache]

Dr.Acharya Phaneendra (25.06.2010 09:05h): à°

[Link] [Cache]

Dr.Acharya Phaneendra (17.06.2010 05:16h): నీటికి కష్టమై …

నీటికి కష్టమై … రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా|| ఆచార్య ఫణీంద్ర ” నీటికి కష్టమై కనుల నీరిడు కాలము దాపురించె – ఏ నాటికి తీరునో వెతలు నా ” కని ఏడ్చెడు నా లతాంగి క న్నీటిని మాపు వేళ ఇదె నేటికి వచ్చెను; నాదు భాగ్యమై మూటెడు డబ్బు చేతికిని ముట్టెను ’ జీతపు పాత బాకి ’ గాన్ ! గొట్టపు బావి యొకటి నే కొట్టించెదనంచు పలుక, కోమలి హృదిలో పుట్టెడు సంతోషముతో పెట్టెను బుగ్గలను ముద్దు, ప్రేమ కురియుచున్ ! మంచి దినము జూచి, మాటాడి యంత్రమున్, పొలతి తోడ గూడి పూజ చేసి ఇంటి కొక్క ప్రక్క ఈశాన్యమున, ఊట కూప మపుడు త్రవ్వ గోరినాను. మట్టి గంగగా మార్చెడు మంత్రగాడు - దాహమును తీర్ప వచ్చిన తంత్రగాడు - అభినవ భగీరథుండగు యంత్రగాడు - ... [Link] [Cache]

Dr.Acharya Phaneendra (13.06.2010 03:32h): చలన చిత్ర కవన ఛత్రపతి

చలన చిత్ర కవన ఛత్రపతి రచన : ‘ పద్య కళా ప్రవీణ ‘ డా|| ఆచార్య ఫణీంద్ర విద్వదుత్తమ కవి – ’ వేటూరి సుందర రామమూర్తి ’ ఘనుడు వ్రాయగలడు వడిగ, సుడిగ, తడిగ – పామర, పండిత రంజకముగ గీత రత్నములను ! ” జగము లేలిన వాని సగము నివ్వెరబోయె “ నని కావ్య పరిమళా లద్దగలడు - ” రాలిపోయే పువ్వ! రాగాలు నెందుకే ? “ యంచు విషాదాబ్ధి ముంచగలడు - ” ఆకు చాటున పిందె – కోక మాటున పిల్ల “ యంచు శృంగారాగ్ని పెంచగలడు - ” ఆరేసుకోబోయి పారేసుకొన్నాన “ టంచు ’ మసాల ’ దట్టించగలడు - ’ సీత కోక చిలుక ’, ’ సిరిసిరిమువ్వ ’ లున్ కేళి యాడు నతని గీతులందు ! ’ శంకరాభరణము ’, ’ సాగర సంగమ ... [Link] [Cache]

Item (1 - 25 of about 310)Next page

 

ArchiveEarlier 1.9.2010  2.9.2010  4.9.2010  

Generiert mit Parteibuch Aggregator 0.5.2


వ్యాఖ్యా సదుపాయం లేదు.

Loading