(42వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా 15-11-2009 తేదీన విజయనగరంలో విజయభావన ఆధ్వర్యంలో జరిగిన సభలో శ్రీమతి భైరవభట్ల దేవీప్రకాశ్ గారి ఉపన్యాస వ్యాసం.) ” ఏ పుణ్య లేశమ్ము నాపాలిదాయెనో నా పూజ కేలోక నాథుండు పొంగెనో నీపావనోదరశ్రీ పరంపరలలో నీ పదార్చకులలో నేనొక్కడనైతి” అని అన్న, అనుకొన్న మహా కవి శ్రీ తుమ్మల సీతారామ మూర్తి చౌదరి. ‘నీ పదార్చకులలో నేనొక్కడ’ అన్నారు కనుకనే ఆయన ‘తెలుగు లెంక’. శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారు ఆధునికకవులలో పేరెన్నికగన్నవారు. ఇతను 1901 లో జన్మించారు.... »
Latest Story
ఛందస్సు 101 – రెండవభాగము
గమనిక: క్రింద మీరు చదవబోయే టపా సంకా రామక్రిష్ణ గారు surasa.net లో ఇంతకుముందెన్నడో ప్రచురించిన తెలుగు ఛందస్సు – 101 అన్నవ్యాసం లో ఒక భాగము. అసలు వ్యాసాన్ని యూనీకోడీకరించి ఆసక్తి ఉన్నవారు సులభం గా చదువుకోవటానికి వీలుగా ఇక్కడ పునః ప్రచురిస్తున్నాం. ఈ పరంపరలోని మొదటి టపా: ఛందస్సు 101 – మొదటి భాగము వృత్తాలు ఉత్పలమాల ఈ వృత్తం నడక ఇలా ఉంటుంది: “తానన... »
శ్రీకాకుళపు దిరునాళ్లు, భట్టు నలగామరాజుకు చెప్పిన రాజనీతి – శ్రీనాథుఁడు
శ్రీకాకుళపు దిరునాళ్లు జవరాలి బొడగన్న సన్యాసిపై నేయుఁ దులసి లేఁజిగురాకుదూపు మరుఁడు వేదవిప్రునిగన్న విధవపై ఝళిపించు దర్భపల్లవహేతి దర్పకుండు కటకారకులకన్య గన్న హాలికుమీఁదఁ బొడుచుఁ బూములుకోల పుష్పశరుఁడు నాడింధమునిగన్న నాతిపై నేయును నలరు జిచ్చఱకోల నంగభవుఁడు బెరసి వెన్నెలగాయంగఁ బేరకమ్మ పులినతలముల నాయాయి కొలములెఱిఁగి తాల్చు శస్త్రాస్త్రములు జారదంపతులకు నసమబాణుండు తిరునాళ్ల నన్నినాళ్ల భట్టు నలగామరాజుకు చెప్పిన రాజనీతి మలిదేవభూపతి మన్నించి యిటకు నన్నుబుత్తంచెను నరనాథ వినుము. పగ వృద్ధిబొందించు భ్రష్టులెకాని అడఁగించునేర్పరు లవనిలో లేరు… పోరు మంచిదికాదు భూమినక్కెడను పాడౌను దేశంబు పగ మించెనేని ప్రజలెల్ల నశియంచి... »
’మృత్యుంజయ శివ శతకము’ – కొన్ని పద్యాలు
శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన “మృత్యుంజయ శివ శతకము” నుంచి కొన్ని పద్యాలు - హర హర యెట్టికవితయొ మఱిమఱినాలోని కోర్కి మనివి యొనర్పన్ గఱకఱకలమున నేడ్చెడుఁ బఱపఱనాపదలఁ గోసి బ్రతికించు శివా! ఊరులు పల్లెలు నారులు చీరలు... »
రాధ స్వప్నము: విశ్వనాథ సత్యనారాయణ
(శృంగార వీథి నుంచి…) ఓ చెలి! రాత్రి నేను గల యొక్కటి గంటిని, దానిలోఁ జిరం టీచతురాంగజుండు మననెయ్యపుఁబ్రోవు యశోదకన్నవాఁ డాచరణంబొనర్చె నొక యద్భుత-మస్మదురోజముల్ మృదు శ్రీచరణాంకితంబులుగ నృత్యముచేసె సకింకిణీధ్వనిన్. అదియొక మాయగా హృదయమందున స్వామి నటిమ్చుచుండె న న్నది తెలియంగవచ్చు, నయినన్ బతిరూపము గానుపించ, దా పదములు కానుపించుఁ,... »
’సూర్యనారాయణ శతకము’ నుంచి కొన్ని పద్యాలు
శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు రచించిన “సూర్యనారాయణ శతకము” నుంచి కొన్ని పద్యాలు. అరయంగా సకల శ్రుతి స్మృతి పురాణాద్యర్థసారంబుఁ బ ల్మరు నాశక్తి కొలందిఁ జూచి తుదకిమ్మై రూఢిఁ గైకొంటి సం సరణాంబోధిఁ దరింపఁజేయుటకు యుష్మద్భక్తి దక్కన్య మీ నరలోకంబున లేదుపాయమని యన్నా... »
