Tag Archive

సాగింతును రుద్రవీణ పై…

By పద్యం.నెట్

అవి ఒట్టి పదాలు కాదు. ఛందస్సనబడే వాయిద్యాలలో నిప్పు రవ్వల్లాంటి అక్షరాలను పక్క పక్కన పోసి ధ్వనులూ, యుద్ధ నగారాలూ మోగిస్తే ఎలా ఉంటుంది? దాశరథి కృష్ణమాచార్య పద్యాలు చదవండి, తెలుస్తుంది. పాఠకులెవ్వరూ సాహితీ ద్రష్టలై ఉండాల్సిన పనిలేదు. భాషా పండితులై ఉండాల్సిన అవసరం లేదు. కవి హృదయం సరిగ్గా పట్టగలిగారా, అదృష్టవంతులే.. లేకపోయినా నష్టం లేదు. పదాతి దళాల పదఘట్టనల చప్పుడూ, ఉరకలెత్తి ప్రవహించే నదీప్రవాహపు హోరు, మత్తెక్కినట్టు ఢీకొనే మబ్బుల జోరు – ఇవేవీ... »

పద్దెము వ్రాయుచున్ వెనుక వైపున చూడకు

By పద్యం.నెట్

దాశరథి వారి “అగ్నిధార” నుంచి కొన్ని పద్యాలు…. పద్దెము వ్రాయుచున్ వెనుక వైపున చూడకు లేఖినీ! మహా పద్దశ దాపురించును, గబా గబ లాగుము వేనవేలుగా పద్దెము; లర్థవాదములపై కను లుంచకుమా! పదావళుల్ ముద్దులు గార్చుచున్ కనుల ముందర తాండవ మాచరించెడిన్ – మహాలేఖిని .1 : అగ్నిధార త్వరపడు! భావసాగరము బాహువు లెత్తుచు... »

దాశరథి: రెండు పద్యాలు, కొన్ని ఊసులు

By పద్యం.నెట్

నాజీ నైజాం రోజులు. వరంగల్ సెంట్రల్ జైలు. హఠాత్తుగా ఒక అర్థరాత్రి తమ తమ వస్తువులన్నీ సర్దుకొమ్మని రాజకీయఖైదీలందరికీ ఆదేశం అందింది. ఖైదీలందరు నిజాం ప్రభువు నిరంకుశత్వాన్ని ఎండగడుతున్న కవులూ రచయితలూను. వారిలో “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అన్న అజరామరమైన మాటలన్న మహాకవి, నాటకకర్త, అనువాదకులు, వ్యాసరచయిత దాశథి గారు కూడా ఉన్నారు. అసలే నిజాం నిరంకుశుడు పైగా మూర్ఖుడు. ఉన్నఫళాన రాజకీయ ఖైదీలండరినీ మూటాముల్లే సర్దుకొమ్మని ఆదేశాలివ్వడం అంటే, వీరికి గుండేల్లో గుబులు... »

Loading