Tag Archive

’మృత్యుంజయ శివ శతకము’ – కొన్ని పద్యాలు

By భైరవభట్ల దేవీప్రకాశ్

శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించిన “మృత్యుంజయ శివ శతకము” నుంచి కొన్ని పద్యాలు - హర హర యెట్టికవితయొ మఱిమఱినాలోని కోర్కి మనివి యొనర్పన్ గఱకఱకలమున నేడ్చెడుఁ బఱపఱనాపదలఁ గోసి బ్రతికించు శివా! ఊరులు పల్లెలు నారులు చీరలు మఱిసకలమైన సిరులివి మేలా యారూఢిగఁ జిరకాలము నీరూపము జూచుకోర్కె నెగడించు శివా! జోడుగఁ దోడుగ నీడగ వేఁడుకతో శ్రుతుల మేళవించుచు నిన్నుం బాడి కసి దీర్చుకొందుము వేఁడెద మాజంటఁబెంచు పెక్కేండ్లు శివా! పెక్కులు ప్రేలెదఁ... »

’సూర్యనారాయణ శతకము’ నుంచి కొన్ని పద్యాలు

By భైరవభట్ల దేవీప్రకాశ్

శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు రచించిన “సూర్యనారాయణ శతకము” నుంచి కొన్ని పద్యాలు. అరయంగా సకల శ్రుతి స్మృతి పురాణాద్యర్థసారంబుఁ బ ల్మరు నాశక్తి కొలందిఁ జూచి తుదకిమ్మై రూఢిఁ గైకొంటి సం సరణాంబోధిఁ దరింపఁజేయుటకు యుష్మద్భక్తి దక్కన్య మీ నరలోకంబున లేదుపాయమని యన్నా సూర్యనారాయణా!’ ఉదయాద్రి న్నినుఁ జూచినంత వెరనెంతో పారు చీఁకట్లు వెం టఁ దగుల్నీ ప్రభకోడి వానిదగు కూనల్పాదుల న్నీడలై యొదుగన్వానిని రేయి తల్లి కడ కోహో తూర్పునంబంపు నీ దుదయ న్నా తరమా గణింప గుణ సింధూ సూర్యనారాయణా! తొలి రంగెద్దియులేని... »

మృత్యుంజయా!

By పద్యం.నెట్

శ్రీ మాధవపెద్ది బుచ్చిసుందరరామ శాస్త్రి గారు వ్రాసిన మృత్యుంజయ శతకము నుండి కొన్ని పద్యములు (కావ్యమాల పుస్తకములోనివి) మెడనాగన్నకు నొక్కటే బుసబుసల్, మేనన్ సగంబైన యా బిడతో నీ కెపు డొక్కటే గుసగుసల్, వీక్షించి మీచంద మె క్కడ లేనంతగ నెత్తిపై రుసరుసల్ గంగమ్మకున్, నీ చెవిం బడుటేలాగునొ మామొఱల్ తెలియదప్పా మాకు మృత్యుంజయా! ముద్దుంజేయుచు ముచ్చటాడుకొనుచున్ మూపందునన్ మోయుచున్ సుద్దుల్సెప్పుచు జెప్పినన్ వినుచు నిన్ జొక్కించుచుం జొక్కుచున్ పెద్దంజేయ మనస్కరింపదు నినున్, బిడ్డంబలెం జూచుచున్ బ్రొద్దుల్పుచ్చుట లున్న జాలు నితరంబుల్గోర మృత్యుంజయా! ఇగ నే నొక్క కణమ్ము... »

Loading